భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలోని కొనుగోళ్ల తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో అవసరం కోసం ఇళ్లు కొనేవారు, కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్, నాణ్యత, సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నారు. మరీ ముఖ్యంగా లైఫ్ స్టైల్ హౌసింగ్, సీనియర్ లివింగ్, సెకండ్ హోమ్స్ అనేవి రియల్టీ రంగంలో వృద్ధిని సూచిస్తున్నాయని తెలుస్తోంది.
మెరుగైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారుల నమ్మకం ఈ మార్పుకు దోహదపడుతోంది. ఈ వృద్ధి కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. ఇందులో మెరుగైన కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగా టైర్-2 నగరాలు కూడా కీలక కేంద్రాలుగా మారుతున్నాయి. కొనుగోలుదారులు లొకేషన్‌తో పాటు కనెక్టివిటీ, ఓపెన్ స్పేసెస్, సమగ్ర జీవన అనుభవం వంటి వాటిపై దృష్టి పెడుతున్నారు. అటు సీనియర్ లివింగ్ అనేది ఒక ప్రత్యేక అసెట్ క్లాస్‌గా ఎదుగుతోంది. పెరుగుతున్న వృద్ధ జనాభా, చిన్న కుటుంబాలు, ఆరోగ్య స్పృహ వంటి కారణాలతో దీనికి ఆదరణ పెరుగుతోంది. మొత్తంగా, భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ కేవలం అవసరాల ఆధారిత కొనుగోళ్ల నుంచి దీర్ఘకాలిక విలువ, నాణ్యమైన జీవనం వైపు పయనిస్తోంది.