– తమిళనాట హాట్ టాపిక్ గా విజయ్ వ్యక్తిగత వివాదాలు
– త్రిష టార్గెట్ గా సింగర్ సుచిత్ర సెన్సేషనల్ కామెంట్స్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ ముసురుకున్న వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మరీ ముఖ్యంగా విజయ్, త్రిష్ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.తాజాగా సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్ చేశారు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుచిత్ర మాట్లాడుతూ, తనకు విజయ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. అదే సమయంలో త్రిష అంటే ఏ మాత్రం నచ్చదని కుండబద్దలు కొట్టారు. త్రిష పేరును ప్రస్తావించకపోయినప్పటికీ, ఆమెను ఒక పారసైట్ అని విమర్శించారు. ఎన్నికల విజయం తరువాత విజయ్ కు ఉన్న క్రేజ్ ను వాడుకోవడానికే త్రిష ఆయన పక్కన చేరుతోందని సుచిత్ర చెప్పుకొచ్చారు.
విజయ్ సతీమణి సంగీత దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన కోలీవుడ్ ను కుదిపేసింది. సంగీత దాఖలు చేసిన పిటిషన్ లో విజయ్ కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని, అది తెలిసినప్పటి నుంచే తమ మధ్య దూరం పెరిగిందని ఆమె పేర్కొన్నారు.దీంతో ఆ నటి మరెవరో కాదని, త్రిషేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో సింగర్ సుచిత్ర చేసిన కామెంట్స్ మరింత వైరల్ గా మారాయి.