Find Articles

ముంబైలో మెగా రచ్చ.. ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్‌కు భారీ ప్లాన్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా ప్రమోషన్స్ స్పీడ్ మీదున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించేందుకు మూవీ యూనిట్ రెడీ అయింది. ఈ నెల 18న జరగనున్న ఈ ఈవెంట్ .. ఈ సంవత్సరం తెలుగు సినిమాల పరంగా చాలా పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఫస్ట్ ట్రైలర్ లాంచ్ ను భోపాల్ లేదా ఇండోర్ లో నిర్వహించాలని భావించినప్పటికీ, చివరకు ముంబైను ఫైనల్ చేశారని సమాచారం.

అంతేకాదు నెక్స్ట్ అప్డేట్ గా సినిమా నుంచి స్పెషల్ సాంగ్ గా మూడో పాటని ఖరారు చేశారు మేకర్స్. ఈ నెల 23న ఆ సాంగ్ ని విడుదల చేస్తున్నట్టు బిగ్ అప్డేట్ ని అందించారు. దీనిపై వదిలిన కొత్త ప్రోమో అభిమానులని, ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. భోపాల్ వేదికగా జరిగే ఈ స్పెషల్ సాంగ్ లాంచ్ ఏ లెవెల్ లో ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ కనిపించనుండగా, జూన్ 4న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది.దీంతో ఈ మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *