– విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్
– ‘రణబాలి’ నుంచి స్పెషల్ గ్లింప్స్
– సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.రౌడీ హీరో పుట్టిన రోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’ నుంచి ఒక ప్రత్యేక మేకింగ్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ మేకింగ్ వీడియోలో ‘రణబాలి’ పాత్ర కోసం విజయ్ దేవరకొండ పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.మరీ ముఖ్యంగా గుర్రపు స్వారీ సన్నివేశాల కోసం ఎంత కఠిన శిక్షణ తీసుకున్నారో హైలైట్ చేశారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు గాయపడినప్పటికీ, ఆయన పట్టుదలతో శిక్షణ పూర్తి చేశారని తెలుస్తోంది.
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 19వ శతాబ్దంలో, 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది.విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా ఈ స్పెషల్ గ్లింప్స్ తో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని తెలుస్తోంది.