Find Articles

కుమ్మేశాడు భయ్యా.. పెద్దిలో అదరగొట్టిన శివ రాజ్ కుమార్

– ‘పెద్ది’ నుంచి ‘గౌర్నాయుడు’ గ్లింప్స్
– మే 18న ముంబైలో సినిమా ట్రైలర్ లాంచ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పెద్ది’. తాజాగా ఈ మూవీలోని కీలకమైన గౌర్నాయుడు పాత్రకు సంబంధించిన వీడియో గ్లింప్స్‌ రిలీజ్ అయింది.

ఈ పవర్‌ఫుల్ పాత్రను కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన గౌర్నాయుడు పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు వీడియోతో మూవీ ప్రమోషన్స్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 18న ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ ను మేకర్స్ గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అలాగే ఈ నెల 23న భోపాల్ లో ఒక స్పెషల్ ఈవెంట్ లో పాటను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తరువాత, పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *