Find Articles

ఆటా 19వ మహాసభల వేళ.. టెన్నిస్ కోర్టులో తెలుగువారి జోష్!

 

అమెరికన్ తెలుగు అసోసియేషన్ — ఆటా 19వ కన్వెన్షన్ వేడుకలకు క్రీడా సందడి మొదలైంది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎలికాట్ సిటీలో నిర్వహించిన ‘ఆటా స్పోర్ట్స్ టెన్నిస్ కిక్ ఆఫ్’ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు క్రీడాభిమానులు, టెన్నిస్ ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడా స్పూర్తి, స్నేహబంధాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ టెన్నిస్ ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఆటా 19వ కన్వెన్షన్‌కు అనుబంధంగా జరిగిన ఈ స్పోర్ట్స్ కిక్ ఆఫ్ కార్యక్రమం తెలుగు సమాజంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *