Find Articles

‘జన నాయగన్’ కోసం సీఎం విజయ్..!!

– వచ్చే నెల విడుదల కానున్న ‘జన నాయగన్’
– దళపతి అనే ట్యాగ్ లైన్ నే కొనసాగించాలని చెప్పిన విజయ్.?

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్నికలకు ముందే తెరకెక్కిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.అడ్డంకులన్నీ తొలగడంతో ఈ సినిమాను వచ్చే నెల విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

విజయ్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘జన నాయగన్’ సినిమాలో ఆయన పేరుకు ముందు ఎప్పటి నుంచో వస్తున్న ‘దళపతి’ అనే బిరుదుకు బదులుగా ‘ముఖ్యమంత్రి విజయ్’ అని వేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, ఈ ప్రతిపాదనను సీఎం విజయ్ సున్నితంగా తిరస్కరించారని సమాచారం.ప్రేక్షకులకు, అభిమానులకు గౌరవమిస్తూ.. ఎప్పటిలాగే ‘దళపతి’ అనే ట్యాగ్ లైన్‌నే కొనసాగించాలని ఆయన నిర్మాతలకు సూచించారని తెలుస్తోంది. రాజకీయ హోదాను దృష్టిలో ఉంచుకుని సినిమాలో విజయ్ ఇంట్రడక్షన్ సీన్లను లేదా కొన్ని డైలాగులను మార్చాలని మొదట అనుకున్నప్పటికీ, కథా గమనం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆ మార్పులు కూడా వద్దని విజయ్ వారించినట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పొలిటికల్ ఇమేజ్ కోసం కాకుండా, సినిమాను సినిమాగా మాత్రమే చూడాలనే విజయ్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *