Find Articles

అషు రెడ్డి ఫేక్ ఎంగేజ్మెంట్.!?

– ‘కళ్లతో చూసేది నిజం కాదు’
– అందరినీ బురిడీ కొట్టించిన బ్యూటీ

బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోస్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు.

మనం కళ్లతో చూసేది నిజం కాదంటూ… విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ షూటింగ్ సెట్‌లోని ఫోటోస్ షేర్ చేశారు అషు రెడ్డి. అలాగే ‘మనం కళ్లతో చూసేది లేదా చెవులతో వినేది ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు. నిజం అనిపించే ప్రతిదీ నిజం కాదు. నమ్మే ముందు ఆలోచించండి అంటూ రాసుకొచ్చారు. సిరీస్ షూటింగ్‌లో భాగంగా హీరోతో ఎంగేజ్మెంట్ వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో అషురెడ్డిది రియల్ ఎంగేజ్మెంట్ కాదని తేలిపోయింది. రీసెంట్‌గా వచ్చిన మోసం ఆరోపణలపై రియాక్ట్ అవుతూ ఆమె ఇలా ఫోటోస్ షేర్ చేసినట్లు తెలుస్తోంది.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *